టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ జయప్రద అంటే తెలియని వారు ఉండరు. అందం అభినయం రెండిటితో ప్రేక్షకులకు ఉర్రూతలూగించిన జయప్రద సినిమాల తర్వాత చిన్నగా రాజకీయాల్లోకి వెళ్లారు. రాజకీయాలన్న తర్వాత ఎవరు ఎప్పుడు ఎలా తమ మీద మాటల దాడి చేస్తారో తెలియదు. వాటికి సిద్ధమై ఉండాలి. జయప్రద కూడా రాజకీయాల్లోకి వచ్చాక చాలా మాటలు పడిందట. ముంబైలో జరిగిన క్వీన్ లైన్ లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్న జయప్రద తనకు జరిగిన అనుభవాలను పంచుకుంది.
తన మీద వచ్చిన ఆరోపణలకు ఆమె ఆత్యహత్య చేసుకుందామని అనుకుందట. తన గాడ్ ఫాదర్ లా భావించే అమర్ సింగ్ తో తనకు సంబంధం అంటకట్టారని. ఆ టైంలో మానసిక క్షోభ అనుభవించానని అన్నది జయప్రద. అంతేకాదు తన మార్ఫింగ్ ఫోటోలను చూసినప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాలనిపించిందని అన్నది జయప్రద.
ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నందుకు సమాజ్ వాది పార్టీ నేత, రాంపూర్ ఎమ్మెల్యే ఆజం ఖాన్ తనపై యాసిడ్ దాడికి ప్రయత్నం జరిగిందని.. ఆయన నుండి తనకు ప్రాణహాని ఉందని బెదిరింపులు వస్తున్నాయని అన్నారు జయప్రద. ఇంటి నుండి బయటకు వెళ్తే తాను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని నమ్మకం లేదని తనకు ఏ నాయకుడు సపోర్ట్ గా నిలవలేదని. అయినా సరే ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని అంటుంది జయప్రద.