ఇండియన్‌ ఐటీ నిపుణులకు బైడెన్‌ తీపి కబురు ఏంటో తెలుసా..?

-

భారతదేశ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తీపి కబురు అందించారు. అమెరికా వెళ్లాలనుకునే భారతీయలకు ఇదొక శుభారంభం. జవవరి 20 తర్వాత చేపట్టే అధ్యక్ష బాధ్యత తర్వాత ట్రంప్‌ అమలు చేసిన ఇమ్మిగ్రేషన్‌ చట్టాలు రద్దుచేసి, కొత్త ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని తీసుకువస్తామని బైడెన్‌ వెల్లడించారు. ప్రధానంగా ఐటీ నిపుణులకు అందించే హెచ్‌–1బీ వీసాల జారీపై ట్రంప్‌ విధించిన ఆంక్షలు ఎత్తేస్తామని ప్రకటించారు. 2021 మార్చి 31 వరకున్న నిషేధాన్ని రద్దు చేసి అందుకు వీలుగా నిబంధనల్లో పలు సవరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

లాటరీ పద్ధతికి గుడ్‌బై..

నూతనంగా ప్రవేశ పెట్టనున్న ఇమ్మిగ్రేషన్‌ బిల్లు పరిశీలనకు ప్రత్యేక కమిటీలకు పంపించనున్నారు. అంతేకాకా ఇప్పుడున్న హెచ్‌–1బీ వీసాల లాటరీ పద్ధతికి కూడా బైడెన్‌ గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిసింది. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాలైన హెచ్‌–1బీ వీసా జారీ కోసం అనుసరిస్తున్న లాటరీ విధానానికి స్వస్తి చెప్పి, వేతనాలు, నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యమిస్తూ, టెక్నాలజీ, ఇంజినీరింగ్, సైన్స్, మ్యాథమేటిక్స్‌లలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి గ్రీన్‌కార్డు సైతం అందించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అభిప్రాయ పడతున్నారు. పదవీ స్వీకారం వెంటనే కరోనాను ఎదుర్కొనేందుకు తక్షణమే ఆర్థిక సాయం చేయాల్సిందిగా కాంగ్రెస్‌ను అర్థిస్తానని బైడెన్‌ తెలిపారు. అయితే.. ఎన్నికల ప్రచార సమయంలో బైడెన్‌ చేసిన హామీలలో ఇమ్మిగ్రేషన్‌ విధానాలను రద్దుచేస్తామనేది కూడా అందులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news