జిమ్ వర్కౌట్లతో భయపెట్టేస్తోన్న జ్యోతిక..!!

-

ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిక తెలుగు, హిందీ చిత్రాల ద్వారా కూడా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను వివాహం చేసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యి అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనే ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. మొన్నటి వరకు సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపని జ్యోతిక ఎక్కువగా తన పిల్లల గురించి, కుటుంబ బాధ్యతల గురించి అలాగే తన భర్తకు నిర్మాణ రంగంలో సహాయ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆమెకు సినిమాలపై ఆసక్తి కలగడంతో రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

జ్యోతిక చేస్తున్న సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. జ్యోతిక షేర్ చేసిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాదు ఒక యంగ్ స్టార్ హీరో కూడా ఈ రేంజ్ లో వర్క్ అవుట్ చేస్తాడా లేదా అన్నట్లుగా జ్యోతిక వర్క్ అవుట్ వీడియో అలరిస్తోంది. ముఖ్యంగా జ్యోతిక మరీ ఇంతగా కష్టపడతారా అంటూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. జ్యోతిక తన వర్కౌట్స్ తోనే అందర్నీ భయపెట్టేస్తోంది అని చెప్పవచ్చు.

జ్యోతిక బ్యాక్ టు బ్యాక్ చిత్రాల విషయానికి వస్తే.. రియంట్రీ తర్వాత బాగానే ఆకట్టుకుంటుంది. కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఎక్కువగా ప్రేక్షకులను అదరిస్తోంది. గతంలో లాగా హీరోల పక్కన రొమాన్స్ చేసే పాత్రలు ఆమె చేయడం లేదు కాబట్టి అందంగా మంచి ఫిజిక్ తో కనిపించాల్సిన అవసరం లేదు అని ఆమె అనుకోవడం లేదు. ఇక తన బాడీ ఫిజిక్ ను మెయింటైన్ చేయడం కోసం కష్టపడి మరి వర్కౌంట్లో చేస్తుంది జ్యోతిక. కమర్షియల్ హీరోయిన్ గా చేయకపోయినా సరే లేడీ ఓరియంటెడ్ సినిమాకు మంచి ఫిజిక్ అవసరం అనే ఉద్దేశంతోనే ఆమె రెగ్యులర్ హీరోయిన్స్ కంటే కూడా ఒకింత ఎక్కువగానే కష్టపడుతోంది. గతంలో కంటే జ్యోతిక ఇప్పుడే చాలా అందంగా, ఫిట్ గా కనిపిస్తున్నారని ఆమె అభిమానులను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jyotika (@jyotika)

Read more RELATED
Recommended to you

Latest news