మీ డబ్బును ఆదా చేసే దీపాలు..నూనె అక్కర్లేదట..

-

దీపావళి వస్తుంది అంటే దీపాలకు ప్రత్యేకత ఉంటుంది.. రకరకాల ఆకృతిలో దీపాలను తయారు చేస్తుంటారు..అయితే మైనమ్ తో తయారు చేసిన దీపాలు లేదా కొవ్వొత్తులకు నూనె తో పనిలేదు.. కానీ మట్టితో చేసే దీపాలకు మాత్రం ఖచ్చితంగా నూనె కావాలి.. ఎవరి స్థాయి తగ్గట్లు వాళ్ళు దీపాలను కొని ఇల్లంతా అలంకరిస్తారు. నిజానికి పురాణాల ప్రకారం కేవలం 13 దీపాలను ఇంట్లో వెలిగిస్తె మంచిదని పండితులు అంటున్నారు..

కనీసం ఈ పండుగ నాడు ఒక దీపం పెట్టిన చాలని పెద్దలు అంటున్నారు.ఒకప్పుడు దీపాలకు వున్న ప్రాముఖ్యత ఇప్పుడు లేదనుకోండి.. ఇప్పుడు అందరూ కాలక్రమేణా ఆధునిక హంగులతో విద్యుత్‌ దీపాలు, రంగురంగుల ఎల్‌ఈడీ దీపతోరణాలు వచ్చాయి.. వీటితో ఇంటికి అందం కూడా ఉండటంతో ఎక్కువ మంది..వీటిని కొనుగోలు చేస్తున్నారు..అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది.

ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు తాజాగా నీళ్లతో వెలిగే దీపాలూ వచ్చేశాయండోయ్‌..అదేలా సాధ్యం..నూనె లేకుండా దీపాలను వెలిగించడం సాధ్యం కాదుకు అనుకోవడం పొరపాటే.. నూనె లేకుండా దీపాలు కూడా ఉన్నాయి.. వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా నిజంగానే అలాంటి దీపాలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ప్రమిదల్లాంటి ప్లాస్టిక్‌ దీపాల్లో ఒత్తుల్లా కనిపించే బల్బులు ఉంటాయి. ప్రమిదలో నీళ్లు పోస్తే చాలు.. లోపల ఉన్న చిన్న బ్యాటరీ సహాయంతో దీపం(బల్బు) వెలుగుతుంది. నీళ్లు తీసేయగానే దీపం వెలగడం ఆగిపోతుంది. ఒక సారి బ్యాటరీ వేస్తే దాదాపు 48 గంటలు అది నిరంతరాయంగా వెలుగుతుంది.. వీటికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదట ఇవి మార్కెట్ లో ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news