ఈ సీజన్ అంతా టాలీవుడ్ లో ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. నిఖిల్ నుండి మొదలుకుని, రానా, నితిన్.. ఇలా వరుసగా ఒక ఇంటివారయ్యారు. మెగా డాటర్ నీహారిక నిశ్చితార్థం జరుపుకుని పెళ్ళికి సిద్ధంగా ఉంది. ఇక స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, అక్టోబర్ 30వ తేదీన గౌతమ్‌తో వివాహం జరుపుకుంటుంది. వ్యాపార వేత్త అయిన గౌతమ్ తో వివాహం సన్నిహితుల సమక్షంలో జరగనుంది.
Kajal Aggarwal Haldi ceremony Event Photos
ఈ మేరకు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫోటోలు బయటకు వచ్చాయి. చేతి నిండా మెహెందీ అలంకరించుకుని పెళ్ళికూతురు కళతో మెరిసిపోతుంది. ప్రీ వెడ్డింగ్ పార్టీ లో కాబోయే భర్తతో డాంస్ చేస్తూ కనిపించింది. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అమ్మడు కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతుంది.