2007లో ‘లక్ష్మీ కల్యాణం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ నటించింది. ఈ క్రమంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘చందమామ’ సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకున్న ఈ సుందరికి కెరీర్లో మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా అవకాశాలు క్యూ కట్టాయి.
2020 లో వ్యాపారవేత్త గౌతం కిచ్లును వివాహం చేసుకున్న ఈ నటి కొద్ది రోజుల కిందట మగ బిడ్డకి జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కాజల్ తన సమయాన్ని తన కొడుకుతో గడుపుతోంది. ఆదివారం ప్రపంచ మాతృత్వ దినోత్సవం సందర్భంగా ఇన్ స్టా గ్రామ్ లో తన కొడుకుని ఎదపై పడుకోబెట్టుకొని ఉన్న స్పెషల్ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోతో పాటు తన తనయుడు నీల్ గురించి సుదీర్ఘ నోట్ రాసుకొచ్చింది కాజల్. తన కొడుకుతో టైం స్పెండ్ చేయడం హ్యాపీగా ఉందని తెలిపింది.
ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. సదరు ఫొటో చూసి నెటిజన్లు ‘ఆసమ్,సో బ్యూటిఫుల్, టూ క్యూట్, హ్యాపీ మదర్స్ డే’ అంటూ కామెంట్ పెడుతున్నారు. అమ్మతనం భగవంతుడు ప్రసాదించిన అరుదైన వరం అని పోస్టులు పెడుతున్నారు.