చంద్ర‌బాబు అవినీతిపై బిజేపీ ఫిర్యాదు

-

Bjp Fire On Chandrababu Naidu

ఏపీ బిజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వం లో ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ESL నరసింహన్ను కలిసి ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు అవినీతి పై ముద్రించిన పుస్తకాన్ని అందచేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై, ఇసుక దోపిడీ తదితర అవినీతి విషయాలపై కన్నా లక్ష్మీనారాయణ వారానికి ఐదు ప్రశ్నలు చప్పున 100 ప్రశ్నలు సంధించారు.

ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గాని,ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానీ,సంబంధిత మంత్రుల నుండి కానీ,అధికారుల నుండి కానీ ఎలాంటి సమాధానం రాలేదని అంటే కన్నా అడిగిన అవినీతిని వారు సమర్ధించుకున్నట్లు భావిస్తూ , ఈ వంద ప్రశ్నలను ఒక పుస్తకరూపం లో అచ్చు వేయించి గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు.

దీనిపై సత్వరమే స్పందించాలని గవర్నర్ ని కోరారు,గవర్నర్ ని కలసిన బృందంలో కన్నా లక్ష్మీనారాయణతో పాటు, మాజీ కేంద్రమంత్రులు పురందేశ్వరి , కావూరి సాంబశివరావు ,ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ IYR కృష్ణారావు,మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు పైడికొండల మాణిక్యాలరావు,ఎస్ సురేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news