ఇటీవల బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యదార్థ కథాంశాలతో తెరకెక్కుతున్న పలు చిత్రాల్లో అత్యధిక శాతం చిత్రాలు ఘనవిజయాలు అందుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి కాశ్మీర్ ఫైల్స్ కూడా చేరింది.
ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. 1980, 90 ల్లో కాశ్మీర్ లోయలో హత్యాచారాలకు గురైన కాశ్మీరీ పండిట్ల యదార్థ సంఘటనలు ఈ చిత్రం కథాంశం.
దేశంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంతకీ ఈ బాలీవుడ్ క్వీన్ ఏమంది అంటే
“కాశ్మీర్ ఫైల్స్ చూశాను కాశ్మీర్ లోయలో కాశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి ఇప్పటివరకు విన్నాను కానీ ఈ చిత్రం ద్వారా చూశాను. ఈ చిత్రం సాధించిన సందర్భంగా మూవీ యూనిట్ కు నా అభినందనలు, కరోనా తర్వాత బాలీవుడ్ లో నిఖార్సైన ఘన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది కాశ్మీర్ ఫైల్స్ మాత్రమే” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఈ చిత్రాన్ని చూసి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొందరు మారుతారని ఆశిస్తున్నా . ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డు నామినేషన్ కు పంపించాలని , అలా పంపకుండా చేసే రాజకీయాలను తిప్పికొట్టాలి అని చెప్పుకొచ్చారు.