అతన్ని నిండా ముంచిన కథానాయకుడు

ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు నిరుత్సాహపరచింది. 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా వారంలో కనీసం 20 కోట్ల మార్క్ కూడా దాటలేదు. కథానాయకుడు బయ్యర్స్ కు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఇక ఈ సినిమా నష్టాలకు పరిహారంగా బయోపిక్ సెకండ్ పార్ట్ మహానాయకుడు ఫ్రీగా ఇచ్చేస్తున్నారట.

ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు నిర్మాత బాలకృష్ణ కన్నా సహ నిర్మాత సాయి కొర్రపాటి ఎక్కువ నష్టపోయాడని తెలుస్తుంది. సినిమాకు కో ప్రొడ్యూసర్ గా ఉంటూ వైజాగ్, సీడెడ్, కృష్ణ, కర్ణాటకలో కొర్రపాటి సాయి సొంతంగా రిలీజ్ చేశాడు. ఆ హక్కులకు సాయి కొర్రపాటి బాగానే ముట్టచెప్పాడట. సో ఎలా లేదన్నా అటు నిర్మాతగా ఇటు డిస్ట్రిబ్యూటర్ గా ఎన్.టి.ఆర్ కథానాయకుడు సాయి కొర్రపాటిని నిండా మునిగేలా చేసిందని తెలుస్తుంది.

మొదటి పార్ట్ లాసులను కవార్ చేసేలా సెకండ్ పార్ట్ జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. కథానాయకుడు సినిమా విషయంలో జరిగిన తప్పులను రిపీట్ కాకుండా చేస్తున్నారట. మరి మహానాయకుడు అయినా హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి.