KGF-3 అప్డేట్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

-

శాండిల్ వుడ్ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం కేజిఎఫ్-1. ఈ సినిమా విడుదలై భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన కే జి ఎఫ్ -2 సినిమా కూడా ఘనవిజయాలను అందుకున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. హీరోగా యష్ అద్భుతమైన నటనను ప్రదర్శించి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.

ఈ సినిమా రాజమౌళి స్థాయిని అందుకుంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కేజిఎఫ్ సిరీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న నేపథ్యంలో కేజిఎఫ్-3 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర అప్డేట్ తెలిసింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్న నీల్ ఆ చిత్రీకరణ పూర్తికాగానే కేజిఎఫ్-3 పట్టాలు ఎక్కిస్తారట. వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభించి 2025 లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news