కే.జి.ఎఫ్ ట్రైలర్.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్

-

ఒకప్పుడు ఒక భాషలో సినిమా ఆ భాషలో హిట్ అయ్యింది అనుకుంటే ఆ తర్వాత కొన్నళ్లకు మిగతా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేవారు. అయితే బాహుబలి తెచ్చిన విజయంతో యూనివర్సల్ సబ్జెక్ట్ అనుకున్న ఏ భాష సినిమా అయినా ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ ప్రయత్నమే చేస్తున్నాడు కన్నడ నటుడు యశ్. అతను హీరోగా వస్తున్న సినిమా కే.జి.ఎఫ్.

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హింది భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను కూడా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్ లో రిలీజ్ చేస్తున్నారు.

1970 కాలం నాటి కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథ సాగుతుంది. అక్కడ జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా ఈ లైన్ రాసుకున్నారట. ట్రైలర్ చూస్తే విజువల్ గా చాలా హార్డ్ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. డిసెంబర్ 21న ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news