కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్టు ఆగినట్టేనా..?

-

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం RRR.. ఇకపోతే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించాల్సిన సినిమా ఆగిపోయింది అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొరటాల శివ చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచ్చలేదని.. కొరటాల శివకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే తన కథతో ఎన్టీఆర్ ను ఇంప్రెస్ చేసే విషయంలో ఫెయిల్యూర్ అవుతున్నారనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండడమే ఇందుకు కారణం..

ఇకపోతే ఆచార్య సినిమా ఫలితం చూసిన తర్వాత కొరటాల శివను తీవ్రస్థాయిలో బాధపెట్టిందని.. ఆ బాధ నుంచి బయటకు రావాలని ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఆయన బయటకు రాలేకపోతున్నారని సమాచారం కూడా వ్యక్తం అవుతుంది. ఇకపోతే ఎన్టీఆర్ 30వ సినిమా విషయంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో అప్సెట్ అవుతున్నారని, సినీ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదని అదే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పడానికి సాక్ష్యం అని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

NTR 30: Jr NTR and Koratala Siva's film announced ahead of the actor's birthday. See motion poster - Movies News

ఇక ఎన్టీఆర్ కొరటాల శివ కోసం మరికొంత సమయం ఇచ్చాడు అని, ఆ సమయంలోపు కొరటాల శివ ఎన్టీఆర్ ను ఇంప్రెస్ చేయకపోతే మరో ప్రాజెక్ట్తో ఎన్టీఆర్ ముందుకు వెళ్తారని కామెంట్ లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోపాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనాతో సినిమాలు తీయాల్సి ఉంది. ఒకవేళ కొరటాల శివ ఆలస్యం చేస్తే తప్పకుండా ఈ డైరెక్టర్లలో ఎవరో ఒకరితో ఎన్టీఆర్ కమిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news