కోడలిపై ప్రశంసల వర్షం కురిపించిన కృష్ణ..!

-

సూపర్ స్టార్ కృష్ణ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఎన్నో అద్భుతాలను సృష్టించి తెలుగు ఇండస్ట్రీలో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ ఇటీవల కాంటినెంటల్ హాస్పిటల్ చికిత్స పొందుతూ నవంబర్ 15వ తేదీన తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల, సినీ ,రాజకీయ ప్రముఖులు, సినీ ప్రేమికుల అశ్రునయనాల మధ్య నిన్న సాయంత్రం ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. కృష్ణ చిన్న కుమారుడు మహేష్ బాబు తండ్రికి దహన సంస్కారాలు పూర్తి చేయడం జరిగింది. అనంతరం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు.

ఇదిలా ఉండగా కృష్ణ మరణంతో వారికి సంబంధించిన పాత వీడియోలు , ఫోటోలు మళ్ళీ ఇప్పుడు ఒకసారి వైరల్ అవుతూ ఉండడం గమనార్హం . ఈ క్రమంలోని తన కోడలు నమ్రత గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. కృష్ణ మాట్లాడుతూ మొదట్లో మహేష్ – నమ్రత ల వివాహానికి మహేష్ అమ్మమ్మ అడ్డు చెప్పింది. కానీ రహస్యంగా ముంబైలో వివాహం జరిపించాము. నమ్రత మా ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఆమెను సంతోషంగా స్వీకరించడం జరిగింది అంటూ తెలిపారు.

కృష్ణ తన కోడలు గురించి మాట్లాడుతూ..” మహేష్ బాబు జీవితంలోకి నమ్రత రావడంతో అతడికి చాలా ఊరట లభించింది.మహేష్ బాబు డేట్స్, ఆర్థిక వ్యవహారాలు, పిల్లల బాధ్యతలు అన్నీ కూడా నమ్రతానే చూసుకుంటుంది. మహేష్ కి ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తుంది. నమ్రతకు ఇటు సినిమా ఫీల్డ్ , అటు వ్యాపార అలాగే పలు అంశాలలో అవగాహన ఉంది అని, నిజంగా ఆమె చాలా తెలివైన అమ్మాయి” అంటూ కోడలిపై ప్రశంసలు కురిపించారు కృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news