రెడ్ డ్రెస్సులో కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తున్న కృతి శెట్టి.. ఫొటోస్ వైరల్..!!

-

ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న కృతి శెట్టి.. అనతి కాలంలోనే వరుస హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో తప్పటడుగు వేసిన ఈ ముద్దుగుమ్మ వరుసగా మూడు హ్యాట్రిక్ ఫ్లాప్ లను కూడా చవిచూసింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా నెటిజెన్లను తన ఫోటోలతో అలరించే ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక అంతేకాదు తన అందాల విందుతో రోజురోజుకు అందర్నీ పిచ్చెక్కిస్తోంది అని చెప్పవచ్చు.

ఇక ఈ సందర్భంగా తాజాగా రెడ్ కలర్ చుడీదార్ లో మెరిసింది. దసరా పండుగ సందర్భంగా అభిమానులకు మంచి అందాల ట్రీట్ అందించింది కృతి శెట్టి.. ఈ రెడ్ డ్రెస్ లో కృతి శెట్టి లేలేత అందాలు ఘాటెక్కగా.. కవ్వించే చూపులతో కుర్రకారును తన వశం చేసుకుంటోంది. ఇక ఈమె ఫోటోలు చూసిన అభిమానుల సైతం పండుగ చేసుకుంటున్నారు.. నిజంగానే దసరా పండుగ తెచ్చింది అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అంతేకాదు ఈమె ఫోటోలకు ఫిదా అయిన నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా రెడ్ చుడీదార్ లో అందాల రాజహంస లా ఉందని.. క్యూట్ అందాలు కాస్త హాట్ గా మారాయి అని ఘాటెక్కిన బేబమ్మ అందాలు అని ఇలా రకరకాలుగా నెటిజన్స్ తమకు నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

ఇక ఈమె ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. వెంకట ప్రభూ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న బైలింగ్వల్ సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది. కనీసం ఈ సినిమాతో నైనా ఆమె ఫామ్ లోకి రావాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news