వారికి రాఘవేంద్రరావు ప్రేమలేఖ..శుభాకాంక్షలు చెప్పిన మహేశ్ బాబు!

-

టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్, సక్సెస్ కు కేరాఫ్ గా నిలిచిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన సీనియర్ డైరెక్టర్..ఇటీవల ‘పెళ్లి సందD’ ఫిల్మ్ తో యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. కాగా, దర్శకేంద్రుడు తన సీనియారిటీ, ఎక్స్ పీరియెన్సెస్ అన్నీ కూడా కేఆర్ఆర్ క్లాస్ రూమ్ పేరిట వివరించారు కూడా.

ఈ నెల 13న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జీవిత విశేషాలపైన బుక్ లాంచ్ చేయనున్నారు. ‘లవ్ లెటర్ టు సినిమా బై కేఆర్ఆర్’ అనే టైటిల్ తో లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు ట్వి్ట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు సూపర్ స్టార్ మహేశ్.

మహేశ్ బాబు హీరోగా నటించిన తొలి సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ట్విట్టర్ వేదికగా మహేశ్ రిలీజ్ చేసిన వీడియోలో ‘మహేశ్ ..కె.రాఘవేంద్రరావును ‘మామయ్య’ అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలపడం విశేషం’. మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న విడుదల కానుంది. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా ‘మహానటి’ కీర్తి సురేశ్ నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news