Double Ismart: మాస్‌ సాంగ్‌ తో వచ్చేసిన రామ్‌…మార్ ముంత చోడ్ చింతా అంటూ రచ్చ..రచ్చ !

-

Double Ismart: చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ఊరమాస్ క్యారెక్టర్​తో మెప్పించిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా వసూళ్లలో.. రికార్డులు బద్ధలు కొట్టిన విషయం తెలిసిందే. రామ్ కెరీర్​లోనే బ్లాక్ బస్టర్​గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​గా డబుల్ ఇస్మార్ట్​గా వస్తున్నాడు రామ్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా పూర్తి చేశారు.

Maar Muntha Chod Chinta Song Promo

ఈ చిత్రం మార్చ్ లోనే విడుదల కావాల్సి ఉంది.అయితే మరికొంత షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలన్స్ ఉండడంతో ఈ చిత్రం విడుదల తేదీని పోస్ట్ పోన్ చేశారు. కానీ మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే… ఈ సినిమా నుంచి ఓ మాస్‌ సాంగ్‌ వచ్చింది. మార్ ముంత చోడ్ చింతా అంటూ సాగే… సాంగ్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు. ఈ పూర్తి పాటను రేపు సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version