TRAILER : ‘మాచర్ల నియోజకవర్గం’లో డైరెక్ట్ యాక్షనే

-

నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ట్రైలర్ అదిరిపోయింది. 3 నిమిషాల ఈ ట్రైలర్ కామెడీ, యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంటోంది. ఇంకా డైరెక్ట్ యాక్షనే అని నితిన్ ట్వీట్ చేస్తూ.. ఈ ట్రైలర్ వీడియోను పోస్టు చేశాడు.

ఇవాళ వైజాగ్ చాలా కొత్తగా కనిపిస్తోందిరా అంటూ నితిన్ డైలాగ్ చెప్పడంతో మొదలైన ట్రైలర్.. వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ కామెడీ ట్రాక్ చూస్తే ఫస్టాఫ్ అంతా కామెడీ ఉంటుందని తెలుస్తోంది. నితిన్ మాచర్ల నియోజకవర్గం ఎన్నికల సమయంలో కలెక్టర్ గా బదిలీ కావడంతో అక్కడి నుంచి యాక్షన్ సీన్స్ మొదలవుతాయని ట్రైలర్ ని చూస్తో తెలుస్తోంది. పులి, జింక, తొక్కా.. తోలు అన్నావంటే.. బొక్కలో ఏసి తొక్కించేస్తా అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ గా నటించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అంజలీ, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన పాట ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు బద్ధలుకొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news