‘మాచర్ల నియోజకవర్గం’లో అంజలి ఐటెం సాంగ్..!

టాలీవుడ్ యువ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ తెరెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఆగస్టు 12న థియేటర్లలో సందడి చేయబోతోంది అని మేకర్స్ ప్రకటించారు. మరో అప్డేట్ కూడా అందించారు మేకర్స్.

ఈ చిత్రం చివరి పాట అయిన ఐటెం సాంగ్‌ గురించి అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఈ పాటలో హీరోయిన్‌ అంజలి నటిస్తోంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ వదిలింది చిత్ర బృందం. మరీ ఈ సాంగ్‌ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. కాగా.. ఎంటర్ టైనర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి,నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.రాజ్ కుమార్ ఆకెళ్ళ మాచర్ల నియోజకవర్గం ప్రాజెక్టును సమర్పిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన నేపథ్యంలో నితిన్ అండ్ టీం సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్ ఇస్తూ ప్రమోషన్స్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.