టాలీవుడ్ లో డ్రగ్స్ సరఫరా వెనుక స్టార్ హీరోలు.!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అంశమే బాలీవుడ్ ని కుదిపేస్తుంది. తాజాగా ఆ సెగ టాలీవుడ్ కి కూడా తాకింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్ ప్రేయసి రియాను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా ఆమె రకుల్ సహా పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టిందని తెలియడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీలత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ అత్యంత సాధారణమని, నార్కోటిక్స్ బ్యూరో తెలుగు చిత్ర పరిశ్రమపైనా ఓ కన్ను వేయాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు. డ్రగ్స్‌ ను ఇక్కడి వారు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూశానని, డ్రగ్స్ సరఫరా వెనక పెద్ద మాఫియానే ఉందని ఆమె పేర్కొంది. పెద్ద పెద్ద హీరోల హస్తం ఇందులో ఉందని ఆమె పేర్కొంది. అదేవిధంగా లాక్‌డౌన్ సమయంలోనూ హైదరాబాద్‌లో చాలా చోట్ల డ్రగ్స్‌ పార్టీలు జరిగాయని ఆమె బాంబ్ పేల్చింది.