ప్రీ రిలీజ్ బిజినెస్ లో కొత్త రికార్డ్ నెలకొల్పు తున్న మహేష్ బాబు.!

-

మహేశ్ బాబు అంటే తెలుగు పరిశ్రమ లో మామూలు సినిమా తో 100 కోట్లు వసూళ్లు రాబట్ట గల సత్తా ఉన్నోడు. ఇక తన సినిమాలు అమెరికా మార్కెట్ లో ఈజీ గా మిలియన్ డాలర్ల మార్క్ ను చేరతాయి.ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB28 వర్కింగ్ టైటిల్ పై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కొన్ని రోజులు కథ సెట్ కాక, మరికొన్ని రోజులు మహేశ్ బాబు కుటుంబంలో విషాదాల వల్ల బాగా లేట్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగతోంది. ప్రస్తుతం హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలో వున్న సారథీ స్టూడియోస్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా సూపర్ యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే చుర కత్తుల లాంటి డైలాగ్స్ ఉండబోతున్నాయి తెలుస్తోంది.ఇందులో యంగ్ సంచలన అందం పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ చిత్రం రిలీజ్ హక్కులు భూమి బద్దలు అయ్యే రేట్లు నమోదు అవుతున్నాయి.ఈ మూవీ యొక్క ఓటిటి రైట్స్ ని ఇప్పటికే ప్రముఖ ఓటిటి సంస్థ ఏకంగా రూ. 80 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ మూవీ యొక్క థియేట్రికల్ రైట్స్ ని అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 150 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇక ఒటిటి, డబ్బింగ్, ఆడియో వంటి నాన్ థియేట్రికల్ రైట్స్ కి కూడా రూ. 150 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇది కనుక నిజం అయితే మహేశ్ బాబు సినిమా చరిత్రలో రికార్డ్ గా ఉంటుంది. ఇక రాజమౌళి సినిమా మనం లెక్క కూడా వేయలేము లెండి.

 

Read more RELATED
Recommended to you

Latest news