మ‌హేష్ కి ఎవ్వ‌రూ స‌రిలేర‌ట‌!

-

టైటిల్ విష‌యంలో మహేష్ చాలా కేర్ తీసుకుంటారు. ఆయ‌న న‌టించిన సినిమాల్లో మూడు అక్ష‌రాల‌తో కూడిన టైటిల్సే ఎక్కువ‌గా ఉంటాయి. మురారి, ఒక్క‌డు, నిజం, అర్జున్‌, అత‌డు, పోకిరి, ఖ‌లేజా, అతిథి, దూకుడు, ఆగ‌డు, స్పైడ‌ర్‌, ఇటీవ‌ల వ‌చ్చిన త‌న 25 వ సినిమా మ‌హ‌ర్షి వ‌ర‌కు స‌గానికిపై సినిమాలు మూడు అక్ష‌రాల టైటిల్స్ తో వ‌చ్చిన‌వే. ఇందులో ఖ‌లేజా, అతిథి, ఆగ‌డు, స్పైడ‌ర్ మిన‌హా మిగిలిన సినిమాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్స్. మూడు కంటే ఎక్కువ అక్ష‌రాల‌తో వ‌చ్చిన రాజ‌కుమారుడు, యువ‌రాజు, ట‌క్క‌రి దొంగ‌, సైనికుడు, బిజినెస్ మేన్‌, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, వ‌న్ః నేనొక్క‌డినే, శ్రీమంతుడు, బ్ర‌హ్మోత్స‌వం, భ‌ర‌త్ అనే నేను వంటి చిత్రాల్లో బిజినెస్ మేన్‌, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, శ్రీమంతుడు త‌ప్ప మ‌రే సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీంతో మూడ‌క్ష‌రాల టైటిల్‌ని మ‌హేష్ సెంటిమెంట్‌గా భావిస్తూ వ‌స్తున్నారు. అయితే మ‌రోసారి ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేయ‌బోతున్నాడ‌ట. త‌న త‌దుప‌రి సినిమాకి ఎనిమిది అక్ష‌రాల‌తో రాబోతున్నారు. ఆ విశేషాలు చూస్తే..


మ‌హేష్ ఇటీవ‌ల వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన‌ మ‌హ‌ర్షి చిత్రం మే 9న విడుద‌లై భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.175కోట్ల‌కుపైగా క‌లెక్ట్ చేసింద‌ని, రూ.200దిశ‌గా వెళ్తుంద‌ని చిత్రబృందం ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి అంత లేద‌ని సినీ విమ‌ర్శ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చాలా చోట్ల ఇంకా న‌ష్టాల్లోనే ఉంద‌నే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా గురించి కాసేపు ప‌క్క‌న పెడితే మ‌హేష్ త‌దుప‌రి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నారు. మ‌హేష్‌కిది 26వ సినిమా. ర‌ష్మిక మంద‌న్నా క‌థానాయిక‌గా ఎంపికైంద‌ని స‌మాచారం. ఈ సినిమా నేడు(శుక్ర‌వారం) పూజా కార్యక్ర‌మాల‌ను జ‌రుపుకోనుంద‌ట‌. జూన్ చివ‌రి వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌కి వెళ్ళ‌నుంద‌ని తెలుస్తుంది. మ‌హ‌ర్షి వ‌లే ఈ సినిమాకి కూడా ముగ్గురు నిర్మాత‌లు నిర్మించ‌నున్నార‌ట‌. దిల్‌రాజు, అనిల్ సుంక‌ర‌తోపాటు మ‌హేష్‌బాబు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగం కాబోతున్నార‌ని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఓ ఆస‌క్తిక‌ర టైటిల్ వినిపిస్తుంది. స‌రిలేరు నీకెవ్వ‌రు అనే పేరుని చిత్ర‌బృందం ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పేరుతో ఈ టైటిల్ ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేయించార‌ని టాక్‌. మ‌రి ఎప్ప‌టిలాగే మూడు అక్ష‌రాలతో వెళ్తారా? లేక ఈ టైటిల్‌నే ఫిక్స్ చేస్తారా అన్న‌ది వేచిచూడాలి. అన్న‌ట్టు ఈ సారి మ‌హేష్‌ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో రాబోతున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మంచి కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తీర్చిదిద్దార‌ట‌. మహేష్ ఇందులో హిలేరియ‌స్‌గా కామెడీ చేయ‌బోతున్నార‌ని టాక్‌.

Read more RELATED
Recommended to you

Latest news