మహేష్ బాబు అడ్డాగా విశాఖ పోర్ట్…. మ్యాటర్ ఏంటంటే….??

ఇప్పటికే ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అతి త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. మహేష్ నటించిన సరిలేరు సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా, మహేష్ బాబు ఈ సినిమాలో ఆర్మీ మేజర్ గా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక రోల్ లో నటించారు. ఈ సినిమాని ఎంచుకోవడం అనేది తన కెరీర్ లో తీసుకున్న బెస్ట్ నిర్ణయంగా అభివర్ణించిన సూపర్ స్టార్,

Superstar Mahesh Completes his 19 years successful career as Hero

ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో టూర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తదుపరి ఆయన నటించనున్న సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుండగా, మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు వంశీ ఆ సినిమాని తెరకెక్కించనున్నట్లు టాక్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మహర్షి సినిమా సూపర్ హిట్ కొట్టింది. అయితే ఆ సినిమాకు పూర్తి భిన్నంగా మంచి ఎంటర్టైన్మెంట్ ని కూడా జోడించి వంశీ ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నాడట. ఇక మహేష్ కూడా ఒకింత డిఫరెంట్ స్టైల్ లో కనింపించనున్నట్లు చెప్తున్నారు.

 

ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమాలో విశాఖపట్నం పోర్ట్ అడ్డాగా మహేష్ బాబు తన గ్యాంగ్ ని నడుపుతుంటారని, ఆ మాఫియా గ్యాంగ్ కి లీడర్ గా మహేష్ క్యారెక్టర్ అదిరిపోనుందని సమాచారం. ఇక ఇప్పటివరకు మహేష్ నటించిన పాత్రలకు భిన్నంగా ఉండనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా, సంగీత దర్శకుడిగా ఎస్ ఎస్ థమన్ వ్యవహరిస్తున్నట్లు టాక్. రాబోయే వేసవిలో పట్టాలెక్కనున్న ఈ సినిమా 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది….!!