‘వెంకీ మామ’ మూవీ పై మహేష్ బాబు సంచలన కామెంట్స్…..!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కెరీర్ బిగింగ్ టైం లో కొంత రిజర్వ్డ్ గా ఉండే మహేష్ బాబు, రాను రాను తన పంథా మొత్తం మార్చుకుని, వీలైనంత ఎక్కువగా పలు విధాలుగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండడం, అలానే తరచు వారిని కలుసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇక ఇటీవల పలు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎంతో యాక్టివ్ గా ఉంటున్న మహేష్ బాబు, వాటి ద్వారా తన సినిమా మరియు వ్యక్తిగత జీవిత విశేషాలను వారితో పంచుకుంటున్నారు.

ఇకపోతే తన ఖాళి సమయాల్లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా విహార యాత్రలు చేసే మన సూపర్ స్టార్, ఎక్కువగా ఎప్పటికప్పుడు రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు చూడడం, వాటిపై తన అబిప్రాయాన్ని తెలియచేయడం చేస్తుంటారు. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమర్షియల్, ఎమోషనల్ ఫిలిం వెంకీ మామ పై మహేష్ బాబు కాసేపటి క్రితం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వెంకీ మామ చూసాను, చాలా బాగుంది, వెంకటేష్ గారు మరియు చైతన్య తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా మామ, అల్లుళ్ళ మధ్య అనుబంధాన్ని తెలిపే సన్నివేశాలతో పాటు సమపాళ్లలో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్ వంటివి చక్కగా కుదిరాయి.

మంచి విజయాన్ని అందుకున్న సినిమా యూనిట్ మొత్తానికి తన తరపున అభినందనలు తెలుపుతున్నట్లు మహేష్ ట్వీట్ చేసారు. మహేష్ ట్వీట్ పై వెంకీ మామ టీమ్ తరపున నాగచైతన్య, దర్శకుడు బాబీ, హీరోయిన్ రాశి ఖన్నాలు మహేష్ బాబుకు ధన్యవాధాలు తెలుపుతూ రీట్వీట్ చేసారు. అలానే పలువురు నెటిజన్లు సూపర్ స్టార్ పై పొగడ్తలు కురిపిస్తున్నారు. మంచి సినిమాలకు తన వంతుగా చూసి, మాట సాయం అందించడంలో మహేష్ అందరికంటే ముందుంటారని, ఆయన రాబోవు సినిమా సరిలేరు నీకెవ్వరు మంచి సక్సెస్ సాధించాలని పలువురు నెటిజన్లు ఆయనకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ముందస్తు అభినందనలు తెల్పుతున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Latest news