నువ్వే నా సూపర్ స్టార్..లవ్ యూ – తండ్రి మృతిపై మహేష్ బాబు పోస్ట్

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం యావత్తు సినీలోకాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఇక గత బుధవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. సినీ ప్రముఖులందరూ ఆయ పార్థివ దేహానికి నివాళులు అర్పించి… కన్నీటి వీడ్కోలు పలికారు.

అయితే, సూపర్ స్టార్ కృష్ణ మృతి నేపథ్యంలో.. మహేష్‌ బాబు స్పందించారు. నువ్వే నా సూపర్ స్టార్ అంటూ తండ్రి మృతిపై మహేష్ బాబు పోస్ట్ పెట్టారు. మీలో నాకు స్ఫూర్తి నిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి, నాకిప్పుడు ఎలాంటి భయం లేదని పేర్కొన్నారు. ఇంతకుముందెన్నడూ లేని బలం నాలో ఉన్నట్లు అనిపిస్తుందని…మీ కాంతి నాలో ఎప్పటికి ప్రకాశిస్తూనే ఉంటుందన్నారు మహేశ్ బాబు. నువ్వు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. నువ్వు ఓ రియల్‌ సూపర్‌ స్టార్‌. నీ చూపు నాపైన ఉంటుంది. నువ్వు లేకపోయినా.. నీ ఆశయాలను ముందుకు తీసుకెళతా. లవ్‌ యూ నాన్న అంటూ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు.  ఈ పోస్టు ఇప్పుడు వైరల్‌ గా మారింది.