రాజమౌళితో మూవీపై మహేశ్ బాబు కామెంట్స్ ఇవే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల ‘సర్కారు వారి పాట’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో మహేశ్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటించింది. ఇక మహేశ్ బాబు నెక్స్ట్ మూవీస్ విషయానికొస్తే.. ఆయన తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 తో పాటు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో పిక్చర్ చేయనున్నారు.

మంగళవారం (ఆగస్టు 9) మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళితో చేయబోయే సినిమా అప్ డేట్ వస్తుందని సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవల మహేశ్..రాజమౌళితో పిక్చర్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ‘బాహుబలి’, ‘RRR’ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో పని చేయడం అనేది తన కలని మహేశ్ పేర్కొన్నారు.

చాలా కాలం తర్వాత తన కల నెరవేరబోతున్నదని సూపర్ స్టార్ తెలిపారు. రాజమౌళితో ఒక్క పిక్చర్ చేయడం అంటే ఒకే సారి 25 ఫిల్మ్స్ చేసినట్లని తెలిపిన మహేశ్.. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ గా రానుందని వివరించారు. శారీరకంగా, మానసికంగా ఆ సినిమా కోసం కష్టపడటానికి సిద్ధమేనని, త్వరలో ఫిల్మ్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పారు.

మరో వైపున మహేశ్ -త్రివిక్రమ్ కాంబో ఫిల్మ్ ‘SSMB28’ షూట్ కూడా స్టార్ట్ కానుంది. ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఫైనల్ అయింది.