చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ రిలీజ్‌పై వార్తలు.. స్పష్టతనిచ్చిన నిర్మాత

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’గా విజయదశమికి ప్రేక్షకులను పలకరించనున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. కాగా, ప్రమోషనల్ ఈవెంట్స్ ఇంకా స్టార్ట్ కాలేదని, అనుకున్న టైమ్ కు పిక్చర్ రిలీజ్ ఉంటుందా? అని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాత ఎన్వీ ప్రసాద్ స్పష్టతనిచ్చారు.

ఎలాంటి ఊహాగానాలు నమ్మొద్దని, అనుకున్న టైమ్ కే అక్టోబర్ 5నే ప్రపంచవ్యాప్తంగా ‘గాడ్ ఫాదర్’ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తామని, అతి త్వరలో ప్రమోషనల్ ఈవెంట్స్ స్టార్ట్ చేస్తామని ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ క్లారిటీనిచ్చారు. ఈ చిత్రం నుంచి తొలి సినీ గీతం త్వరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ పిక్చర్ లో భారీ తారాగణమే ఉంది. నయనతార, సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, సునీల్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.

తమిళ్ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతంలో చిరంజీవితో ‘హిట్లర్’ సినిమాకు పని చేసిన మోహన్ రాజా ఈ సినిమా ద్వారా తెలుగు లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ డెఫినెట్ గా హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news