రెండో పెళ్లిపై స్పందించిన మ‌నోజ్‌.. ఏమ‌న్నాడో తెలుసా..?

-

మంచు మనోజ్’ చేసినవి తక్కువ సినిమాలే అయినా మనవాడికి సోషల్ మీడియా పుణ్యమా అని వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. తండ్రికి ఉన్న ఇమేజ్ ని మనోజ్ పెద్దగా వాడుకోలేకపోయాడు అనేది వాస్తవం. చేసిన సినిమాలు అన్నీ దాదాపుగా ఫ్లాప్ కావడంతో అభిమానులతో సోషల్ మీడియాలో ఎక్కువగా టచ్ లో ఉంటాడు. తన కుటుంబ విషయాలను పంచుకుంటూ పలరిస్తూ ఉంటాడు మనోజ్.

తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి మనోజ్ విడాకులు కూడా ఇచ్చాడు. కొంత కాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఏ సినిమా కూడా చేయడం లేదు. కుటుంబానికి కూడా మనోజ్ దూరంగానే ఉంటున్నాడనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇక ఈ నేపధ్యంలోనే ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించే ఆలోచనలో మనోజ్ ఉన్నాడు అనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది.

ఇక భార్య ప్రణతికి దూరమైన తర్వాత అతను రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది ఇప్పుడు ఆ అనుమానాలను నిజం చేస్తూ మనోజ్ ఒక ట్వీట్ చేసాడు. తను ఫైర్ బాల్‌గా వెలగడానికి అంతా రెడీ అయిందని, ఈ వారంలో ఓ ఆసక్తికరమైన ప్రకటన తన నుంచి వస్తుందని పోస్ట్ చేసాడు. ఆ ప్రకటన దేని గురించో తెలియకపోయినా ఇది కచ్చితం పెళ్ళి గురించే అని అతని అభిమానులు అంటున్నారు. మరి ఎవరిని చేసుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news