ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్.. మెగా డాటర్ శ్రీజకు ఏమైంది..?

మెగా ఫ్యామిలీలో అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా మెగా డాటర్స్ కొణిదెల సుస్మిత, శ్రీజ, నిహారిక ఎప్పటికప్పుడు తమ లైఫ్ లో జరుగుతున్న విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఈ ముగ్గురిలో ముఖ్యంగా కొణిదెల శ్రీజ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు.

కేవలం సోషల్ మీడియా ద్వారానే కాదు.. శ్రీజ పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆమె ఎక్కువగా లైమ్ లైట్ లో ఉంటారు. తరచూ ఆమె గురించి ఏదో ఓ వార్త వస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్​ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

ఇటీవలె కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్​తో కలిసి శ్రీజ వెకేషన్ కు వెళ్లారు. వెకేషన్ నుంచి వచ్చిన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేశారు. ఈ పోస్టు చూసి ఆమె ఫ్యాన్స్ శ్రీజకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. కానీ పోస్టు కింద హాష్ ట్యాగ్ చూసి కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ ఆ పోస్టులో ఏం ఉందంటే..?
‘నా కష్టసుఖాల్లో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను కోపంలో ఉన్నప్పుడు నవ్వించారు. ఏడుస్తున్నప్పుడు భుజం తట్టారు. నేను మాట్లాడినప్పుడు విన్నారు. నేను ఏం చేసినా స్వీకరిస్తూ వచ్చారు. నాకు కొండంత అండగా నిలబడ్డారు. ఇలాంటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ దొరికినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ సోషల్​మీడియాలో వైరల్‌గా మారింది. వరల్డ్ గ్రాటిట్యుడ్ డే సందర్భంగా శ్రీజ ఈ పోస్టు చేశారు.