షబ్బీర్ అలీ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ లో నేతలు ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకోవడం తారాస్థాయికి చేరింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న షబ్బీర్ అలీని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రియాంకా గాంధీని కోరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Hyderabad: Komatireddy Venkat Reddy wants Centre to cancel nod to Pharma  City

ఇందుకు గల కారణాలను కూడా ఆయన తన లేఖలో వివరించడం గమనార్హం. చీటింగ్ సహా పలు ఇతర కేసుల్లో షబ్బీర్ అలీకి ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రస్తావించారు. ఈ కారణంగా షబ్బీర్ అలీ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అదే జరిగితే పార్టీ పరువు పోతుందని చెప్పారు. షబ్బీర్ ను ఇంకా పార్టీలోనే కొనసాగిస్తే ఆయన వల్ల పార్టీకి నష్టం జరగవచ్చని కూడా ఆందోళన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.