Mega154 : “వాల్తేరు వీరయ్య” గా వచ్చేసిన చిరు.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే

-

గాడ్ ఫాదర్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య గా అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తూనా ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.

మెగా 154 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ అలాగే టీజర్లు ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించాయి. కాగా దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రం బృందం.

ఇక మొదటి నుంచి ప్రచారంలో ఉన్న… వాల్తేరు వీరయ్య టైటిల్ నే ఫిక్స్ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు టైటిల్ పోషతో సహా టైటిల్ టీజర్ ను కూడా వదిలింది. ఇక ఈ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపించాడు. అలాగే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించింది చిత్రం బృందం.

Read more RELATED
Recommended to you

Latest news