Mehreen Pirzada : అందమా అందమా.. అందనంటే అందమా

-

మెహరీన్ పిర్జాదా.. నేచురల్ స్టార్ నానితో కలిసి కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో నటించింది. ఫస్ట్ మూవీయే నేచురల్ స్టార్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో ఈ భామ అందంతో పాటు నటన కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఆ సినిమాలో నేను చెప్పానా.. నీకు చెప్పానా.. నేను చెప్పానా అనే డైలాగ్ తో చాలా ఫేమస్ అయింది మెహరీన్. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇక ఈ బ్యూటీ నటించిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ఎఫ్2లో హనీ ఈజ్ ద బెస్ట్ అనే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీలో మెహరీన్ వరుణ్ తేజ్ కు జోడీగా నటించింది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మెహరీన్ బాలీవుడ్ లో నూ పలు సినిమాల్లో నటించింది.

ఈ భామ ఓ రాజకీయ నాయకుడితో ప్రేమలో పడింది. భవ్య బిష్ణోయ్ అనే యంగ్ పొలిటీషియన్ తో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కొద్ది రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా అకస్మాత్తుగా ఓరోజు తామిద్దరం విడిపోయామంటూ.. పెళ్లి క్యాన్సిల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి షాక్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహరీన్ తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ వేర్ లో ఈ భామ చాలా అందంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news