రౌడీ హీరో పై మోజు పడ్డ మిస్ ఇండియా..!!

-

ఈ మధ్యకాలంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట సైడ్ క్యారెక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా దర్శనమిచ్చాడు. లవ్ స్టోరీ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయనకి ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా ఉండదని చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మాయిలు ఇతడిని ఎంతగా ఇష్టపడతారు అంటే విజయ్ దేవరకొండ ఫోటోను టాటుగా వేయించుకోవడానికి కూడా వెనుకాడడం లేదు అంటే విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు పెరగడంతో పాటు సెలబ్రిటీల వరకు కూడా ఆయనకు అభిమానులుగా మారుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మిస్ ఇండియా వరల్డ్ గా ఎన్నికైన కన్నడ యువతి సినీ శెట్టి కూడా విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ స్టార్ హీరో అని చెప్పింది. ఇక ఆయనను కలిసే సందర్భం వస్తే చాలా సంతోషిస్తానంటూ తెలిపింది. పెళ్లిచూపులు , టాక్సీవాలా, అర్జున్ రెడ్డి , గీతగోవిందం వంటి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఇతడు ప్రస్తుతం లైగర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.

ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ పెరిగింది .అక్కడ కూడా పలువురు స్టార్ సెలబ్రెటీలు విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరో అని చెప్పుకోవడం అతని క్రేజ్ కి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇకపోతే ఇటీవల ముంబైలో ఏర్పాటు చేసిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన అభిమానులను చూసి బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు. దీన్ని బట్టి చూస్తే విజయ్ దేవరకొండకు అభిమానులలో ఎంత అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news