ప్రభుదేవాను దర్శకుడిని చేసిన నిర్మాత.. ఎవరంటే?

-

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా.. కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.. దర్శకుడు, హీరో అని అందరికీ తెలుసు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ప్రేమికుడు’ చేసిన ప్రభుదేవా.. తెలుగులో పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఆ తర్వాత హీరోగానూ ఇంట్రడ్యూస్ అయ్యారు. కాగా, ప్రభుదేవా ఆ తర్వాత కాలంలో దర్శకుడిగా మారారు. ఆయనను దర్శకుడిని చేసిన నిర్మాత ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా సూపర్ హిట్ సాంగ్స్ చేశారు. ప్రభాస్ ‘వర్షం’ సినిమాలో సాంగ్స్ కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కు ప్రభుదేవా క్లోజ్ అయ్యారు. దర్శకుడిగా తన సినిమాకు పని చేస్తావా? అని ఆ సందర్భంలో ఎం.ఎస్.రాజు ప్రభుదేవాను అడిగారట. అలా ప్రభుదేవా వెంటనే ఓకే చెప్పేశాడు.

అలా ఎం.ఎస్.రాజు ..ప్రభుదేవాను దర్శకుడిని చేశారు. ప్రభుదేవా ప్రస్తుతం దర్శకుడిగా పలు సినిమాలు చేస్తూనే హీరోగానూ నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన ప్రభుదేవా.. తెలుగులో మాత్రం తాను కొరియోగ్రాఫర్ నేనని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రభుదేవా దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటాన’ పిక్చర్ సూపర్ హిట్ అయింది. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో ఫ్యామిలీ డ్రామా ప్లస్ లవ్ స్టోరి ఉండటం విశేషం. సిద్ధార్థ్ హీరో కాగా, హీరోయిన్ గా త్రిష నటించింది. రియల్ స్టార్ శ్రీహరి, పరచూరి వెంకటేశ్వరరావు కీలక పాత్రలు పోషించారు. ప్రభుదేవా ఆ తర్వాత ‘పౌర్ణమి’ చిత్రం ద్వారా ప్రభాస్ ను డైరెక్ట్ చేశారు. ప్రభుదేవా ఇటీవల సల్మాన్ ఖాన్ తో దర్శకుడిగా ‘రాధే’ సినిమా చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొటింది.

 

Read more RELATED
Recommended to you

Latest news