బోల్డ్ గా కనిపిస్తేనే.. నా EMI లు చెల్లించగలుగుతాను.. జాన్వీ కపూర్..!

-

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వికపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బోల్డ్ ఫోటోషూట్లకు పెట్టింది పేరు ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీ లోకి రాకముందే తన అందచందాలతో కుర్రకారును తనవశం చేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి కారణం కూడా ఈమె బోల్డ్ నెస్ అనే చెప్పాలి. తన అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనకాడని జాన్వి కపూర్ బికినీలో తప్ప తన అందాలను పూర్తిగా చూపించేసింది అని చెప్పవచ్చు.. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె ఏం మాట్లాడినా సరే అదొక సంచలనం అవుతోంది. మొన్నా మధ్య విజయ్ దేవరకొండ కి ప్రాక్టికల్ గా పెళ్లయిపోయిందంటూ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన ఇప్పుడు బోల్డ్ గా కనిపిస్తే తప్ప ఈఎంఐ కట్టలేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె కూడా ఈఎంఐ లు కడుతూ ఉందట. అయితే ఆ EMI ల కోసం డబ్బు ఎలా సంపాదిస్తుందో కూడా వెల్లడించింది.

ఇటీవల ఈమె నటించిన మిలీ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొన్న జాన్వి కపూర్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా మత్తెక్కించే ఫోటోషూట్లతో, బోల్డ్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చెమటలు పట్టించే ఈ ముద్దుగుమ్మ తాను అలా చేయడానికి కూడా కారణం చెప్పింది. సోషల్ మీడియాను సీరియస్గా తీసుకోనని.. ఏదో సరదాగా మాత్రమే తీసుకుంటానని వెల్లడించింది. ముఖ్యంగా తాను అందంగా బోల్డ్ గా, క్యూట్ గా కనబడితేనే ఇంకో 5 మంది తన ఫోటోలు లైక్ చేస్తారని, తనకు ఇంకో బ్రాండ్ ని ప్రమోట్ చేసే అవకాశం వస్తుందని కూడా చెప్పింది.

ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయగా వచ్చిన డబ్బులతోనే నేను ఈఎమ్ఐ లు చెల్లిస్తున్నాను.. నా హాట్ పిక్స్ పెడితేనే కదా నేను ఈఎమ్ఐ లు చెల్లించడం వీలు అవుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.. అంతేకాదు ఎవరు కూడా ఊరికే ఫోటోలు పెట్టరు.. ఇది ఒక వ్యాపారం లాంటిది అంటూ చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version