ఆమె నా హృదయాన్ని ముక్కలు చేసింది – నాగ చైతన్య

-

వరుస హిట్లతో జోరుమీదున్న నాగ చైతన్య ఖాతాలో మరో హిట్‌ పడనున్నట్లు కనిపిస్తోంది. లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్లు కొట్టిన చైతు ఇప్పుడు ‘థ్యాంక్యూ’ సినిమాతో హ్యట్రిక్ హిట్‌ కొట్టేటట్లు టీజర్‌ చూస్తుంటే అనిపిస్తోంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన రిలీజ్‌ కానుంది.

ఈ నేపథ్యంలో… ‘థ్యాంక్యూ’ మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా ఓ మీడియా ఛానెల్‌కు నాగ చైతన్య ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు నాగ చైతన్య. తాను 9 వ తరగతి లోనే ఓ అమ్మాయిని లవ్‌ చేసినట్లు వెల్లడించాడు. కానీ అదే అమ్మాయిని.. తనతో సహా తన స్నేహితులు ఇద్దరూ లవ్‌ చేశారని చెప్పాడు చైతూ. కానీ చివరికీ.. ముగ్గరికి ఆ అమ్మాయి హ్యాండ్‌ ఇచ్చిందని.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో ముగ్గురం తమ స్నేహాన్ని కొనసాగించినట్లు చెప్పుకొచ్చాడు చైతూ. కాగా.. గతేడాది సమంతకు చైతూ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news