రేయ్ పృధ్వి నాకొకసారి ఫోన్ చెయ్యి.. కమెడియన్ కు నాగబాబు వార్నింగ్..!

210

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని తెలిసిందే. పవన్ కు సపోర్ట్ గా నాగబాబు చేస్తున్న ప్రయత్నాలు వార్తల్లో నిలుస్తున్నాయి. రీసెంట్ గా పవన్ జనసేన కోసం వరుణ్ తేజ్, నాగబాబు కలిసి కోటి పాతిక లక్షలు విరాళాలు ఇచ్చారు. అయితే ఈ విరాళాల మీద థర్టీ ఇయర్స్ పృధ్వి కామెంట్ చేశాడు. ఎక్కడ నుండో తెచ్చిన డబ్బుని తన కొడుకు ఖాతాలో వేయించి పార్టీకి విరాళం ఇచ్చారని అన్నాడు పృధ్వి.

అయితే దీనిపై మీ కామెంట్ ఏంటని నాగబాబుని ఇంటర్వ్యూయర్ అడుగగా రేయ్ పృధ్వి రేపు నువ్వు కానొకసారి ఫోన్ చెయ్యి.. నీకే చెబుతున్నా నా నంబర్ నీ దగ్గర ఉంది ఫోన్ చెయ్యి అంటూ కెమెరాకు చూపించి వార్నింగ్ ఇచ్చారు నాగబాబు. పృధ్వి అడిగిన ప్రశ్నకు మాకు సమాధానం చెప్పాలని కోరగా.. ఎవరికో ప్రూఫ్ చూపించాల్సిన అవసరం మాకు లేదని తన ఎకౌంట్ లోంచి పాతిక లక్షలు, వరుణ్ తేజ్ అకౌంట్ నుండి కోటి ఇచ్చాం. అది బ్లాక్ మని కాదు ఎకౌంటెడ్ క్యాష్.. అది ఐటికి చూపించామని అన్నారు నాగబాబు. మరి నాగబాబు కామెంట్స్ పై పృధ్వి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.