న‌టుడు అక్ష‌య్ కుమార్ దాతృత్వం.. అమ‌ర జ‌వాన్ల కుటుంబాల‌కు రూ.5 కోట్ల భారీ విరాళం..!

-

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్ష‌య్ కుమార్ మ‌రోసారి త‌న దాతృత్వాన్ని చాటుకున్నాడు. పేద కుటుంబాల‌కే కాదు, అమ‌రులైన జ‌వాన్ల కుటుంబాల‌కు స‌హాయం అందించ‌డంలో అక్ష‌య్ ఎప్పుడూ తోటి స్టార్ల క‌న్నా ముందే ఉంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా పుల్వామా దాడిలో మృతి చెందిన జ‌వాన్ల కుటుంబాల‌కు అక్ష‌య్ రూ.5 కోట్ల భారీ విరాళాన్ని అంద‌జేశారు. అంతేకాదు, అమ‌ర‌వీరులైన జ‌వాన్ల కుటుంబాల‌ను ఆదుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు ముందుకు రావాల‌ని అక్ష‌య్ పిలుపునిచ్చారు.

భార‌త ప్ర‌భుత్వం అందుబాటులోకి తెచ్చిన bharatkeveer.gov.in (భార‌త్ కే వీర్‌) వెబ్‌సైట్‌లో విరాళాల‌ను అందించాల‌ని బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా వేదిక‌గా త‌న అభిమానుల‌కు పిలుపునిచ్చారు. పుల్వామా దాడిని మ‌నం ఎప్ప‌టికీ మ‌రువలేమ‌ని, ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌తో భార‌తీయులంద‌రి ర‌క్తం ఆగ్ర‌హంతో మ‌రిగిపోతుంద‌ని, స్పందించాల్సిన స‌మ‌యం ఇద‌ని, క‌నుక అంద‌రూ తోచిన‌తం స‌హాయం చేసి, అమ‌రులైన సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని, అదే జ‌వాన్ల‌కు మ‌నం ఇచ్చే ఘ‌న నివాళి అని.. అక్ష‌య్ పిలుపునిచ్చారు.

కాగా మ‌రో వైపు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా జ‌వాన్ల కుటుంబాల‌కు రూ.2.50 కోట్ల‌ను విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఉగ్ర‌దాడిలో అమ‌రులైన జ‌వాన్ల సంఖ్య 49కి చేరుకుంద‌ని, 50 మందికి తాను రూ.2.50 కోట్ల‌ను విరాళంగా ఇస్తున్నాన‌ని బిగ్ బి ప్ర‌క‌టించారు. మ‌రో వైపు ప‌లువురు ప్ర‌ముఖ సినీ తార‌లు, క్రీడాకారులు కూడా స్పందించి విరాళం ఇచ్చేందుకు ముందుకు వ‌స్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ అమ‌రుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌ల విరాళం అంద‌జేయ‌గా, తెలుగు సినీ న‌టుడు విజ‌య్ దేవ‌ర కొండ కూడా ఇప్ప‌టికే ఆర్థిక స‌హాయం అంద‌జేశారు.

Read more RELATED
Recommended to you

Latest news