Big Boss Season 6: ‘బిగ్ బాస్’ సీజన్ 6 స్టార్ట్స్..సామాన్యులకు నాగార్జున ఆహ్వానం

-

పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ OTT ఇటీవల ముగిసిన సంగతి అందరికీ విదితమే. కాగా, అప్పుడే నెక్స్ట్ సీజన్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు టాలీవుడ్ కింగ్, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. ఇక ఈ సీజన్ స్పెషాలిటీ ఏంటంటే..ఈ సారి ఈ సీజన్ లో సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు నాగార్జున.

సీజన్ ఫైవ్ ట్రోఫి విన్నర్ గా బిందు మాధవి నిలిచింది. ఇక సీజన్ సిక్స్ కు సంబంధించిన పూర్తి వివరాలకు starmaa.startv.com వెబ్ సైట్ చూడొచ్చని, అందులో వివరాలు నమోదు చేసుకోవచ్చని నాగార్జున సూచించారు.

సీజన్ 6లో సామాన్యులకు ఆహ్వానం పలుకుతున్నట్లు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంట్లో ఉండాలనుకునే వారికి ఇది గోల్డెన్ చాన్స్ అని నాగార్జున సదరు వీడియోలో తెలిపారు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కాబోతున్నదని ఈ సందర్భంగా నాగార్జున చెప్పుకొచ్చారు. అయితే, ఈ సీజన్ OTT లో స్ట్రీమవుతుందా? లేదా స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news