అల్లుడిని రిపేర్ చేస్తున్న నాగార్జున..!

-

అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. ముందు ఆగష్టు 31 రిలీజ్ అనుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 13కి వాయిదా వేశారు. అయితే వాయిదాకి కారణాలు మ్యూజిక్ రికార్డింగ్ అని తెలియగా ఇప్పుడు అసలు కారణం సినిమాకు నాగార్జున రిపేర్లే అని తెలుస్తుంది. తనయుల సినిమాల మీద ఓ కన్నేసి ఉంచే నాగార్జున చైతు కెరియర్ లో అత్యంత ప్రెస్టిజియస్ గా వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా రఫ్ కట్ చూశాడట.

కొన్ని సీన్స్ నాగార్జున వద్దని వాటి బదులు వేరే సీన్స్ సూచించాడని తెలుస్తుంది. మారుతి డైరక్షన్ లో వచ్చే సినిమాలకు అన్ని తానే చూసుకుంటాడు. మొదటిసారి మారుతి నాగ్ మాటలను వినాల్సి వచ్చింది. మారుతి సినిమాకు నాగ్ రిపేర్లు సినిమా హిట్ కు ఉపయోగపడితే మంచిదే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సినిమా ట్రైలర్ మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా వస్తుందని అనిపించగా సెప్టెంబర్ 13 వినాయక చవిరి సందర్భంగా చైతు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news