యూనివర్సిటీ హాల్ టికెట్ లో బిగ్ బీ అమితాబ్ ఫోటో!

-

ఏంటి.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పరీక్షలు రాస్తున్నాడా? ఈ వయసులో అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే.. అది అమితాబ్ బచ్చన్ హాల్ టికెట్ కాదు. అది యూనివర్సిటీ విద్యార్థిది. కాని.. అందులో ఆ విద్యార్థి ఫోటో బదులు బిగ్ బీ ఫోటో పడింది. ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ లో ఉన్న డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవద్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకున్నది.

ఈ యూనివర్సిటీకి చెందిన అఫీలియేటెడ్ కాలేజీలో అమిత్ ద్వివేదీ అనే స్టూడెంట్ బీఎడ్ చదువుతున్నాడట. సెకండ్ ఇయర్ పరీక్షల కోసం యూనివర్సిటీలో ఫీజు కూడా కట్టాడట. దీంతో పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ యూనివర్సిటీ నుంచి మనోడికి ఇంటికి పోస్ట్ లో వచ్చిందట. సెంటర్ ఎక్కడ పడిందని చెక్ చేసుకుందామని హాల్ టికెట్ ఓపెన్ చేసిన అమిత్ హాల్ టికెట్ ను చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే.. ఆ హాల్ టికెట్ మీద బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫోటో ఉంది. దీంతో షాక్ తిన్న అమిత్.. వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశాడట. పరీక్షలు దగ్గర పడటంతో అదే ఫోటో ఉన్న హాల్ టికెట్ తో పరీక్ష రాయాలని.. మార్కుల మెమోలో మాత్రం తన ఫోటో వచ్చేలా యూనివర్సిటీలో మార్పిస్తానని హామీ ఇచ్చాడట ప్రిన్సిపాల్.

Read more RELATED
Recommended to you

Latest news