అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లు – న‌మ్ర‌త టీమ్‌

బాలీవుడ్ డ్ర‌గ్ కేసు చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు తిరుగుతోంది. ఊహించ‌ని వారిని ఈ వివాదం చుట్టుముడుతోంది. కొంత మంది కోర్టుని ఆశ్ర‌యిస్తుంటే కొంత మంది మాత్రం త‌మ‌పై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోందంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డ్ర‌గ్స్ వివాదంలో టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేష్ వైఫ్ న‌మ్ర‌త శిరోద్క‌ర్ పేరు ని ఓ జాతీయ మీడియా ప్ర‌సారం చేయ‌డంతో టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి.

జ‌య సాహా తో న‌మ్ర‌త చాట్ చేసింద‌ని జాతీయ మీడియాలో ఓ క‌థ‌నం ప్ర‌సారం కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే ఈ క‌థ‌నం ఓ క‌ట్టుక‌థ అని న‌మ్ర‌త టీమ్ ఖండిస్తోంది. ప్ర‌స్తుతం న‌మ్ర‌త బాంబేలో వున్నార‌ట‌. డ్ర‌గ్స్ వివాదంలోకి లాగుతున్నారని, డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్టు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని న‌మ్ర‌త టీమ్ స్పందించింది. డ్ర‌గ్స్ వివాదంలో న‌మ్ర‌త పేరుని అన‌వస‌రంగా వాడుతున్నార‌ని, అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని స్ప‌ష్టం చేసింది.