Dasara : “దసరా” నుంచి నాని ఊర మాస్ లుక్..ఫ్యాన్స్‌ ఇక జాతరే

-

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇప్పుడు నాని తన నెక్స్ట్ ఫిల్మ్ ‘దసరా’పైన ఫుల్ ఫోకస్ పెట్టేశాడని తెలుస్తోంది. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మహానటి’ కీర్తి సురేశ్ ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ పిక్చర్ షూటింగ్ 30 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్‌, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక తాజాగా ఇవాళ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి నాని ఊర మాస్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. ఈ పోస్టర్‌ లో నాని లుక్‌ చాలా మాస్‌ గా ఉంది. ఎల్లుండి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ కానున్న నేపథ్యంలోనే ఈ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news