నాటు నాటు పాట ప్రారంభం మాత్రమే.. హీరో నాని

-

టాలీవుడ్ స్టార్ హీరో నాని ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో తన చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో సినిమా విషయంలో ప్రమోషన్స్ మరింత పెంచేశారు. ముంబైలో సైతం పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆర్ఆర్అర్ సినిమా పై తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు.

నాచురల్ స్టార్ నాని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఆర్ఆర్అర్ సినిమా గురించి రాజమౌళి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సినిమా అంటేనే దక్షిణాది సినిమా అనేటట్టు రాజమౌళి మార్చేశారని చెప్పుకొచ్చారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలిగిన దర్శకుడు రాజమౌళి అని.. షూటింగ్ సమయంలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో పరిశీలిస్తారని.. ఒక సీను వివరించే సమయంలో దాన్ని తెరకెక్కించే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని తెలిపారు. ఎవరికీ రాని ఆలోచనలు సైతం రాజమౌళికే వస్తాయని అందుకే అంత విజయవంతం అయ్యారని తెలిపారు..

Aagadu Audio Launch Live Streaming-Audio Function Photos-Videos-Reviews

అలాగే ఈ సినిమాలో నాటు నాటు పాటకు తప్పకుండా ఆస్కార్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన నాని తెలుగు మాస్ పాట ప్రపంచ దేశాలు దృష్టిని ఆకర్షించిందని అన్నారు. ఈ పాట కచ్చితంగా ఆస్కార్ గెలుచుకుంటుందనే నమ్మకం తనకు ఉందని.. భారతీయ సినిమాలు ఎంతో ప్రత్యేకమైనవని అన్ని విధాల ప్రేక్షకులను అలరిస్తున్నాయని.. నాటు నాటు పాట కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపారు.

కాగా దసరా మూవీ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇందులో నాని మాస్ లుక్ లో కనిపించనున్నారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా కనిపించనుంది..

Read more RELATED
Recommended to you

Latest news