ఓటీటీ లో భయపెట్టడానికి సిద్ధమైన నయనతార కనెక్ట్..!

-

తాజాగా నయనతార నటించిన కనెక్ట్ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫారం పైకి రాబోతున్నట్లు సమాచారం.. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీని డైరెక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విగ్నేష్ శివన్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలకపాత్ర పోషించారు. కుటుంబ నేపథ్యంలో హర్రర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 22న గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫారం పైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈనెల 24వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా తెలుగుతోపాటు తమిళంలో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం స్వయంగా ప్రమోషన్స్ లో నయనతార పాల్గొనడం సంచలనంగా మారింది. దాదాపు పది సంవత్సరాలు తర్వాత నయనతార ఇంటర్వ్యూ ఇచ్చారు..ఇకపోతే ఇన్ని రోజులు తాను ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి గల కారణాన్ని చెబుతూ.. హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వరు.. ఒక మూలన కూర్చోబెడతారు.. అందుకే ప్రమోషన్స్లో పాల్గొనడానికి ఇష్టపడను అంటూ నయనతార స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...