సుశాంత్ కేసు విచారిస్తున్న అధికారికి కరోనా..!

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. కాగా, బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును విచారిస్తున్న ఎన్​సీబీ అధికారుల్లో ఒకరికి కరోనా సోకింది. దీంతో బుధవారం విచారణను తొందరగా కంప్లీట్ చేశారు.

విచారణలో భాగంగా సుశాంత్​ మాజీ మేనేజర్​ శ్రుతి మోదీని కేవలం గంటసేపు మాత్రమే ప్రశ్నించి పంపించేశారు. మిగిలిన అధికారులకు పరీక్షలు చేయిస్తున్నట్టు, తగిన జాగ్రత్తలు పాటిస్తున్నట్టు ఎన్​సీబీ పేర్కొంది. ఇకపోతే ఈ కేసు విషయంలో ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి రిమాండ్ లో ఉంది. అలాగే ఆమె తమ్ముడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.