అవకాశాల కోసం అలా చేస్తున్నావంటూ అషురెడ్డిపై దారుణమైన ట్రోల్స్..!!

-

బ్యూటిఫుల్ భామ అషురెడ్డి..సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ ను నెట్టింట ఇచ్చేస్తుంటుంది ఈ సుందరి. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తుంటుంది. ‘బిగ్ బాస్’ సీజన్ త్రీ తో పాటు ఓటీటీ సీజన్ లోనూ పార్టిసిపేట్ చేసింది. కాగా, అషురెడ్డిని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

నితిన్ ‘చల్ మోహన్ రంగా’ సినిమాలో ఒక పాత్ర పోషించిన అషురెడ్డి..తన ప్రైవేటు పార్ట్ పై పవన్ కల్యాణ్ పేరును టాటూగా వేయించుకున్న సంగతి తెలిసిందే. తనకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని, తన ‘తొలిప్రేమ’ అతనేనని తెలిపింది. ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ ను కలిసి ఆయనతో ఫొటో కూడా దిగింది అషురెడ్డి.

ఈ క్రమంలోనే తన ఫస్ట్ అవ్ అయిన పవన్ కల్యాణ్ పైన ఉన్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా తెలిపింది అషురెడ్డి. కాగా, అషురెడ్డి అలా చెప్పడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. కేవలం అవకాశాల కోసమే అషురెడ్డి పవన్ కల్యాణ్ పేరు చెప్తున్నదని, అలా ఆయన పేరు చెప్పి కాక పడుతున్నదని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అషురెడ్డిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ కు అషురెడ్డి ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news