అఫీషియల్: యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్..KGF టెక్నీషియన్ జాయిన్

-

యాక్షన్ కింగ్ అర్జున్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరోగా ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ బాగా ఆడాయి. కాగా, గత కొద్ది రోజుల నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్నదని వార్తలొస్తున్నాయి. కాగా, ఆ వార్తలు నిజమని తేలాయి. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

ఈ చిత్రం లో ఇంకో విశేషముందండోయ్..అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ఇందులో కథానాయికగా నటించబోతున్నది. ఇటీవల విడుదలైన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఇప్పుడు మరో సినిమా దక్కించుకున్నారు. ఇది విశ్వక్ సేన్ కు 11వ చిత్రం కాగా, ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ స్నేహితుడు , టాలీవుడ్ స్టైలిష్ విలన్ జగపతి బాబు కూడా నటిస్తుండటం విశేషం.

శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.15గా ఈ సినిమాను అర్జున్ యే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అర్జున్ కూతురు ఐశ్వర్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి స్టోరి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా యాక్షన్ కింగ్ అర్జున్ యే ఉంటుండటం విశేషం. ఇక ఈ చిత్రానికి KGF ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నట్లు తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు మేకర్స్.

 

Read more RELATED
Recommended to you

Latest news