సుశాంత్ కేసులో మరో సంచలన ట్విస్ట్.. పోలీసులు షాక్..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ నెల 14 ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. దీనిపై ముంబై పోలీసుల బృందం ద‌ర్యాప్తు వేగంగా సాగుతుంది. సుశాంత్ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్ప‌టికే 27 మందిని విచారించారు. అయితే ఈ ఆత్మహత్య కేసు మాత్రం రోజురోజుకు మలుపు తిరుగుడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్ నెల‌కొంది..

two of sushanth fans roped themselves
 

సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది రోజుల ముందు ట్విట్టర్‌లో కొన్ని ట్వీట్స్ చేసి డిలీట్ చేశాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఈ కోణంలోనూ ముంబై పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ డిలీట్ చేసిన ట్వీట్స్ వివరాలను తెలుసుకునేందుకు ముంబై పోలీసులు ట్విట్టర్ ఇండియాకు లేఖ రాశారు.