ఉద‌య్‌పూర్‌లో నిహారిక ఏం చేస్తోంది?

మెగా డాట‌ర్.. నాగ‌బాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక గుంటూరుకు చెందిన‌ చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ని వివాహం చేసుకోనున్న విష‌యం తెలిసిందే. ఐజీ ప్ర‌భాక‌ర్ రావుకి మెగా ఫ్యామిలీతో గ‌త కొన్నేళ్లుగా మంచి అనుబంధం వుంది. ఆ అనుబంధాన్ని బంధుత్వంగా మార్చుకుంటున్నారు. నిహారిక – చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ల ఎంగేజ్‌మెంట్ ఇటీవ‌ల ఆగ‌స్టులో జ‌రిగిన విష‌యం తెలిసిందే.

వీరి డెస్టినేష‌న్ వెడ్డింగ్ కోసం ఇప్ప‌టికే డేట్‌ని కూడా ఫిక్స్ చేశారు. డిసెంబ‌ర్ 9న వీరి వివాహం జ‌ర‌గ‌బోతోంది. రాజ‌స్థాన్‌ ఉద‌య్‌పూర్‌లోని ఓబెరాయ్ ఉద‌య్ విలాస్‌లో నిహారిక – చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ల డెస్టినేష‌న్ వెడ్డిండ్ జ‌ర‌గ‌బోతోంది. ఇందు కోసం వెడ్డింగ్ ప్లాన‌ర్స్‌ని రంగంలోకి దించారు. ఇటీవ‌లే నిహారిక అండ్ టీమ్ ఉద‌య్ పూర్ చేరుకున్నార‌ని తెలిసింది. ఓబెరాయ్ ఉద‌య్ విలాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక దీనికి సంబంధించిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. అక్క‌డ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లపై వెడ్డింగ్ ప్లాన‌ర్స్‌తో చ‌ర్చిస్తోంద‌ట‌.. వెడ్డింగ్ రోజు ఏర్పాట్లు ఎలా వుండాలి.. రిసెప్ష‌న్ స్టేజ్ ని ఎలా ముస్తాబు చేయాలి అనే విష‌యాల్ని నిహారిక ద‌గ్గ‌రుండి చూసుకుంటోంద‌ట‌.

నిహారిక పెళ్లికి అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు కానున్నార‌ట‌. అందుకే త‌క్కువ మంది సెల‌బ్రిటీల‌కు మాత్ర‌మే ఆహ్వానాలు అందిన‌ట్టు తెలిసింది. నిహారిక హీరోయిన్‌గా హ్యాపీ వెడ్డింగ్‌, సూర్య‌కాంతం వంటి చిత్రాల్లో న‌టించింది. కానీ అవి ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాయి. వెబ్ సిరీస్‌లు నిర్మించిన నిహారిక న‌టిగా కంటే నిర్మాత‌గానే మంచి పేరు తెచ్చుకుంది.