బాహుబలి సినిమా అంత క్రేజ్ ను అందుకున్న నిఖిల్ మూవీ..!!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా బాహుబలి ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా విదేశాలలో సైతం రికార్డులను కొల్లగొట్టింది.. ఇక నిఖిల్ విషయానికి వస్తే.. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా మినిమం గ్యారెంటీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఇక తర్వాత సోలో హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అయితే వీటిలో చాలా వరకు సినిమాలకి ఆశించినంతగా గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి. కానీ 2013 లో వచ్చిన స్వామి రారా సినిమాతో నిఖిల్ కు ఒక్కసారిగా మంచి క్రేజ్ లభించింది. ఇక అప్పటినుంచి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఈ క్రమంలోని కార్తికేయ సినిమాతో ప్రేక్షకులను బాగా మెప్పించిన నిఖిల్.. కార్తికేయ 2 సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాంచందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఇక అభిషేక అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చారు. ఇకపోతే తెలుగుతో పాటు మరో నాలుగు భాషలలో విడుదలైంది ఈ సినిమా.5 years of S.S. Rajamouli's Baahubali: The Beginning – 10 interesting facts – Planet Bollywood

తాజాగా ప్రేక్షకుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 సినిమా డివోషనల్ మిస్టరీ మూవీగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ఈ సినిమా చాలా బాగుంది అంటూ ట్వీట్లు కూడా వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ లోనే ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్లిన డైరెక్టర్ ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేశారట. ఇక సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతమైన వీ ఎఫ్ ఎక్స్ తో బాహుబలి సినిమాను తలపిస్తోంది అని క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఏది ఏమైనా బాహుబలి సినిమా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది అంటే కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అంటూ ట్వీట్ లు రావడం గమనార్హం.